పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి కొండపల్లి

777చూసినవారు
పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి కొండపల్లి
చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో పల్స్ పోలియో కార్యక్రమం కీలకమని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలియో రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్