విజయనగరం పట్టణంలో ఒలింపిక్ డే రన్ కార్యక్రమం రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఆయన బెలూన్లు ఎగరవేసి, చిన్నారులు, క్రీడాకారులతో కలిసి పరుగులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, క్రీడా సంస్కృతికి విజయనగరం జిల్లా ప్రసిద్ధి చెందిందని తెలిపారు. యువత క్రీడలను జీవనశైలిలో భాగం చేసుకోవాలని, ప్రతిరోజూ వ్యాయామం, క్రీడలకు సమయం కేటాయించాలని పిలుపునిచ్చారు.