ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి

1084చూసినవారు
ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి
విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలోని పాచలవలస గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ సీఎం చంద్రబాబు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో టిడిపి పోలిట్ బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి, మండల పార్టీ అధ్యక్షుడు చప్ప చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్