గజపతినగరంలో బిజెపి సైద్ధాంతిక మార్గదర్శి దివంగత పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు శుక్రవారం జరిగాయి. బిజెపి రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని ముఖ్యఅతిథిగా పాల్గొని, దీన్ దయాల్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఆరిశెట్టి ఏడుకొండలు, మండల ఉపాధ్యక్షుడు వేమలి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.