పాచిపెంటలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

2చూసినవారు
పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పాచిపెంట గ్రామంలో జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. మాదిరెడ్డి సతీష్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని నాయకులకు సూచించారు. ఈ వేడుకల్లో పార్టీ నాయకులు జడ్డు శ్రీనివాసరావు, జమ్ము వెంకటేష్, జి ప్రసాద్, ఉమామహేశ్వరరావు, ప్రదీప్ కుమార్ దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్