ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా, విజయనగరం జిల్లా గజపతినగరం మండలం ముడిదాం గ్రామ పంచాయతీ జనసైనికుల ఆధ్వర్యంలో, శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో గ్రామ ప్రజలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రజలకు ఉచిత వైద్య
పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు. ఆరోగ్య పరిరక్షణపై వైద్యులు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో
జనసేన నాయకులు, ఆసుపత్రి సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.