దత్తిరాజేరు మండలంలోని దత్తి గ్రామంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,
జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ ముందస్తు జన్మదిన వేడుకలు మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమాని పెంకి తిరుపతి నాయుడు కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ప్రతి ఏడాది పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.