గంట్యాడ మండలంలో ప్రశాంతంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్

3చూసినవారు
విజయనగరం జిల్లా గజపతినగరం పరిధిలోని గంట్యాడ మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా కొనసాగుతోంది. పెద్దమజ్జిపాలెం, కొండతామరపల్లి గ్రామాల్లో ఉదయం నుండే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికల సిబ్బంది పర్యవేక్షణలో రాజకీయ పార్టీల ఏజెంట్ల సహకారంతో ప్రక్రియ సజావుగా సాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్