గోవా రాష్ట్ర గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజుని గజపతినగరం సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ ఉపేంద్ర మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అఖిలభారత ఐపి ఏ ఎస్ పి కాన్ఫరెన్స్ సమావేశాల సందర్భంగా గోవా వెళ్లిన ఉపేంద్ర, తన సహచర పోస్టల్ అధికారులతో కలిసి పోస్టల్ శాఖ ద్వారా అందిస్తున్న పొదుపు బీమా, కొరియర్ తదితర సేవల గురించి గవర్నర్కు వివరించారు. ఉపేంద్ర ఐపి ఏఎస్పి అసోసియేషన్ కి సహాయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.