గజపతినగరం మండలం మర్రివలస ప్రాథమిక పాఠశాలలో ఇటీవల ప్రారంభించిన 'నేను చేసిన మంచిపని' కార్యక్రమం ఫలితాలనిస్తోంది. పాఠశాల విద్యార్థులు తాడి పూజ, ముగడ గాయత్రిలకు ₹1100 దొరకగా, వారు ఆ డబ్బును పోగొట్టుకున్న వారికి తిరిగి అప్పగించారు. వారి మంచి పనిని పలువురు అభినందించారు. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కనకల చంద్రరావు సోమవారం తెలిపారు. ఈ మంచి పనిని పుస్తకంలో నమోదు చేయడం జరిగింది.