గర్భస్థ శిశువు లింగ నిర్ధారణకు సంబంధించిన అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1800 233 2447 టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్‌ను ప్రజలు వినియోగించాలని DMHO జీవన రాణి గురువారం సూచించారు. గర్భంలోని శిశువు లింగ నిర్ధారణ, లింగ ఎంపిక సేవల ప్రచారం, అనుమతి లేని స్కానింగ్ కేంద్రాల నిర్వహణ చట్టవిరుద్ధమని ఆమె హెచ్చరించారు. ఇటువంటి అక్రమాలపై సమాచారం ఉంటే హెల్ప్‌లైన్‌కు తెలియజేయాలని ప్రజలకు సూచించారు. ఈ చర్యల ద్వారా అక్రమ లింగ నిర్ధారణకు పాల్పడేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.