వెలుగు సిబ్బందితో ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ పాణి సమీక్ష

116చూసినవారు
వెలుగు సిబ్బందితో ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ పాణి సమీక్ష
గజపతినగరం వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద బుధవారం, వెలుగు డిఆర్డిఏ సిబ్బందితో ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ పాణి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిజిటల్ ఎంసీపీ ద్వారా లోన్స్, రికవరీలను మండలం, గ్రామ సంఘం వారీగా పరిశీలించి, సమీక్షించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ప్రతి సభ్యురాలికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో గజపతినగరం, దత్తిరాజేరు, బొండపల్లి, గంట్యాడ, మెంటాడ మండలాల వీవో ఏఎస్, సీసీలు, అకౌంటెంట్లు, ఏపీఎంలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్