గజపతినగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రజల సమస్యలను స్వీకరించారు. తాగునీరు, రహదారులు, గృహాలు, ఉపాధి, పింఛన్లు వంటి పలు సమస్యలపై వివిధ గ్రామాల ప్రజలు వినతులను అందజేశారు. ప్రతి సమస్యను పరిశీలించి, ప్రాధాన్యత క్రమంలో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.