గజపతినగరం నియోజకవర్గ పరిధిలోని గజపతినగరం జిన్నాం గ్రామాల్లో బుధవారం శ్రీ సంత్ రవిదాస్ 649వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎస్సీ మోర్చ రాష్ట్ర, జిల్లా అధ్యక్షుల ఆదేశాల మేరకు జిల్లా ఉపాధ్యక్షుడు పొగిరి గౌరీ రవిదాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పొగిరి రాంబాబు, రమణ, వెంకటప్పలనాయుడు, నవీన్ పాల్గొన్నారు.