గజపతినగరంలో ఆదివారం జరిగిన సత్యసాయి సేవాదళ్ జిల్లా స్థాయి శిక్షణ శిబిరంలో రాష్ట్ర అధ్యక్షుడు రఘుపాత్రని లక్ష్మణరావు మాట్లాడుతూ, సేవా కార్యక్రమాల్లోనే సాయితత్వం దాగి ఉందని అన్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేంద్ర, రాష్ట్ర సేవాదళ్ కోఆర్డినేటర్ విశ్వనాథరెడ్డి, రాష్ట్ర గ్రామ సేవా కోఆర్డినేటర్ ఎం సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు సునీల్ కుమార్ రథో, జిల్లా సేవాదళ్ కోఆర్డినేటర్ ఎల్వి మనోహర్ తదితరులు పాల్గొన్నారు. కన్వీనర్ వెంకటేష్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.