జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ అమలు చేయాలి

1054చూసినవారు
జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ అమలు చేయాలి
గజపతినగరం సివిల్ జడ్జి కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షులు లెoక రాంబాబు మాట్లాడుతూ, న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని, జూనియర్ న్యాయవాదులకు ఆర్థిక సాయం అందించాలని కోరారు. గతంలో వైయస్ జగన్ పాదయాత్రకు వచ్చినప్పుడు ఈ వినతి పత్రం ఇచ్చారని, అప్పటి ప్రభుత్వం జూనియర్ న్యాయవాదులకు ఆర్థిక సాయం అందజేసిందని, అయితే ప్రస్తుతం ఆ సాయం నిలిపివేశారని తెలిపారు. జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ అమలు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్