గజపతినగరంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి శ్రీనివాస్

174చూసినవారు
గజపతినగరంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి శ్రీనివాస్
గజపతినగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణలో ఆదివారం రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా, జాతీయ రహదారి పక్కన గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు గంట్యాడ శ్రీదేవి, మక్కువ శ్రీధర్, రామ్ కుమార్, కొండపల్లి భాస్కర నాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్