మంత్రి శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

96చూసినవారు
గజపతినగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణలో ఆదివారం, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, జాతీయ రహదారి పక్కన ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం, పార్టీ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు గంట్యాడ శ్రీదేవి, మక్కువ శ్రీధర్, రామ్ కుమార్, కొండపల్లి భాస్కర నాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్