విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని మధుపాడ గ్రామంలో గురువారం బుర్ల నాయుడు, అప్పలనాయుడు, కృష్ణలకు చెందిన రెండు ఎకరాల టేకు తోట అగ్నికి ఆహుతైంది. ఆజాగ్రత్తగా పొగత్రాగి పారేసిన నిప్పు వల్ల ఈ ప్రమాదం జరిగిందని, దీనితో సుమారు 30 వేల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి, సమీపంలోని పశువుల శాలలకు, మామిడి తోటలకు మంటలు వ్యాపించకుండా అడ్డుకున్నారు.