ఆలయ సందర్శన మానసిక ప్రశాంతతనిస్తుంది.. మంత్రి కొండపల్లి

5చూసినవారు
ఆలయ సందర్శన మానసిక ప్రశాంతతనిస్తుంది.. మంత్రి కొండపల్లి
విజయనగరం జిల్లా గజపతినగరం మండలం బి. రాజేరు గ్రామంలో శ్రీ శ్రీ దుర్గా మల్లేష్ సమేత గణపతి సుబ్రహ్మణ్య స్వామి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాల సందర్శనలు మానసిక ప్రశాంతతనిస్తాయని అన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఆలయ నిర్మాణం ఎంతో ఆహ్లాదభరితంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గోపాల రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్