రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం బోండపల్లి మండలంలోని కొత్తపాలెం గ్రామంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, కార్యకర్తలకు కష్టమొస్తే అండగా నిలబడతామని తెలిపారు.
టీడీపీ నాయకులందరూ సమానమేనని, సీఎం చంద్రబాబు యువతకు తొలిసారిగా ఎమ్మెల్యే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో 84 మందికి అవకాశం ఇచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గజపతినగరం ఏఎంసీ చైర్మన్ గోపాల రాజు, మాజీ జెడ్పిటిసి బండారు బాలాజీ తదితరులు పాల్గొన్నారు.