విద్యుత్ షాక్ తగిలి యువకుడు మృతి

681చూసినవారు
విద్యుత్ షాక్ తగిలి యువకుడు మృతి
గజపతినగరంలో సెంటర్ లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన పోల్‌కి ఉన్న స్విచ్ బోర్డుకు కేప్ లేకపోవడంతో, పోల్ పట్టుకుని రోడ్డు దాటుతున్న సమయంలో సోమవారం 18 ఏళ్ల యువకుడు ఆకుల ఏడుకొండలు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. తుమ్మికాపల్లి గ్రామానికి చెందిన ఏడుకొండలు స్నేహితులతో క్రికెట్ ఆడుకుని వస్తుండగా ఈ విషాద ఘటన జరిగింది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో రెండు వారాల్లో అతని సోదరి పెళ్లి జరగాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్