విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మంగళవారం గజపతినగరంలోని ప్రతిభ జూనియర్ కళాశాలలో విద్యార్థులతో మాట్లాడుతూ ఉత్తమ సమాజ నిర్మాణానికి యువతే కీలకమని అన్నారు. నీతి, నిజాయితీ, క్రమశిక్షణ అలవర్చుకుని, ఎంచుకున్న రంగంలో రాణించాలని, సాంకేతిక రంగాన్ని మంచికి ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఎం శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్ గోపాల రాజు, పిఎసిఎస్ చైర్మన్ బంగారునాయుడు తదితరులు పాల్గొన్నారు.