గజపతినగరంలో బుధవారం దివంగత వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలను వైసిపి శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా కాలం రాజుపేట మాజీ సర్పంచ్ గేదెల ఈశ్వరరావు మాట్లాడుతూ వైయస్సార్ ప్రజల మనిషి అని, ఆయన లేకపోయినా ప్రజల మనసులో సుస్థిర స్థానం సంపాదించారని అన్నారు. ఆయన వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.