గజపతినగరంలో వైయస్సార్ వర్ధంతి వేడుకలు

1చూసినవారు
విజయనగరం జిల్లా గజపతినగరంలో బుధవారం దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైయస్సార్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్ జోహార్ వైయస్సార్ జోహార్ అంటూ నినదించారు. ఈ కార్యక్రమంలో గజపతినగరం జడ్పిటిసి గార తౌడు, మండల పార్టీ అధ్యక్షుడు పల్లి సంజీవరావు, వైసీపీ నేతలు బెల్లాన త్రినాధరావు, గేదెల ఈశ్వరరావు, శ్రీనివాసరావు, బూడి వెంకటరావు, కనకల సుబ్రహ్మణ్యం, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్