
కురుపాం: మాజీ మంత్రి పుష్పశ్రీవాణికి సుప్రీంకోర్టులో ఊరట
మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణిపై కొనసాగుతున్న ఎస్టీ కుల వివాదానికి సంబంధించి దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ నిర్ణయంతో ఈ వివాదానికి అత్యున్నత న్యాయస్థానంలో ముగింపు పలికినట్లు అయిందని ఆమె అనుచరులు తెలిపారు. దీంతో పుష్పశ్రీవాణికి పెద్ద ఊరట లభించినట్లుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అంతిమ విజయం న్యాయానిదే అంటూ ఆమె అనుచరులు హర్షం వ్యక్తం చేశారు.







































