గిరిజన పీజీఆర్ఎస్‌లో 11 వినతులు స్వీకరణ

101చూసినవారు
గిరిజన పీజీఆర్ఎస్‌లో 11 వినతులు స్వీకరణ
గిరిజన సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని పార్వతీపురం ఐటీడిఏ ఇంచార్జి ప్రాజెక్ట్ అధికారి సి. యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐటీడిఏ కార్యాలయంలో నిర్వహించిన గిరిజన పీజీఆర్ఎస్‌లో పాల్గొని, గిరిజనుల నుంచి తాగునీరు, రోడ్లు, మరుగుదొడ్లు, జనన ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ అప్డేటింగ్ వంటి 11 రకాల సమస్యలపై వినతులు స్వీకరించారు. ప్రతి వినతిని ఆన్‌లైన్‌లో నమోదు చేసి, త్వరితగతిన పరిష్కరించాలని, అవసరమైతే క్షేత్రస్థాయిలో పర్యటించాలని అధికారులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్