ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 9 ఫిర్యాదుల స్వీకరణ

162చూసినవారు
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 9 ఫిర్యాదుల స్వీకరణ
పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. అదనపు ఎస్పీ ఎం. వెంకటేశ్వరరావు అర్జీదారుల నుంచి 9 ఫిర్యాదులు స్వీకరించి, కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, భూ వివాదాలు వంటి సమస్యలను నేరుగా విన్నారు. వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని, విచారణ అనంతరం నివేదికలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిసిఆర్బీ సీఐ ఆదం, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్