ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు ఆదేశాల మేరకు, ఎమ్మెల్సీ నాగబాబు ఆధ్వర్యంలో పార్టీ బలోపేతం కోసం ఏర్పాటు చేసిన కమిటీలో తమకు స్థానం కల్పించాలని బి. జె. పురం గ్రామానికి చెందిన మెండి శ్రీనివాసరావు, మండల జగన్నాధరావు వినతి పత్రాలను పార్వతీపురం మన్యం, కురుపాంలలో అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ ఆశయాల సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని, పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు.