కొమరాడ మండలం కళ్లికోట, దుగ్గి గ్రామాల్లో భీమ్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం. రవి సిద్ధార్థ్ పర్యటించారు. విద్య,
ఉద్యోగాలు, దళితుల ఐక్యత కోసం రేపు పార్వతీపురం లో జరగబోయే యువ సమ్మేళనం నాలుగవ సదస్సు కార్యక్రమానికి అందరూ హాజరై విజయవంతం చేయాలని ఆయన గ్రామ యువతను కోరారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం జిల్లా దళితుల సామజిక కార్యకర్త చంటి, భీమ్ సేన నాయకులు, దళిత నాయకులు పాల్గొన్నారు.