సీహెచ్సీ పనులు త్వరగా పూర్తి చేయాలి

189చూసినవారు
సీహెచ్సీ పనులు త్వరగా పూర్తి చేయాలి
కురుపాం మండల కేంద్రంలో నిర్మిస్తున్న సామాజిక ఆరోగ్య కేంద్రం ఆసుపత్రి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డితో కలిసి నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన, నాణ్యత పాటిస్తూ గడువులోగా పూర్తి చేయాలని, గిరిజన ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని తెలిపారు. సివిల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనులను సమాంతరంగా పూర్తి చేయాలని సూచించారు. జాప్యం లేదా నాణ్యత లోపాలు ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్