జిసిఎమ్ సొసైటీ ఆధ్వర్యంలో పార్వతీపురం బ్రాంచ్ మేనేజర్ ఎం. సాంబశివరావు గురువారం జియ్యమ్మవలస మండలం వనజ గ్రామంలో 30 మంది రైతులకు 2025-26 సంవత్సరానికి ఎకరాకు రూ. 30 వేల చొప్పున మొత్తం రూ. 9.60 లక్షల పంట రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. వరి పంట చేతికి వచ్చిన తర్వాత ధాన్యం విక్రయంతో రుణాలు చెల్లించాల్సి ఉంటుంది. సిబ్బంది ఆరుగురు రైతుల నుంచి రూ. 1.60 లక్షలు వసూలు చేశారు. మిగిలిన రైతులు రెండు వారాల్లో చెల్లిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేల్స్‌మెన్లు బి. గంగారావు, గౌరీ శంకరావు పాల్గొన్నారు.