చిన్న తిరుపతిలో ప్రసాదాల నాణ్యతపై ఆందోళన.

342చూసినవారు
చిన్న తిరుపతిలో ప్రసాదాల నాణ్యతపై ఆందోళన.
పార్వతిపురం మన్యం జిల్లాలోని "చిన్న తిరుపతి"గా పేరుగాంచిన తోటపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డు ప్రసాదాల విక్రయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎండోమెంట్ శాఖ పరిధిలోని ఈ ఆలయంలో, టెండర్ ప్రక్రియ లేకుండా తోటపల్లి టెంపుల్ డెవలప్మెంట్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో లడ్డూలు విక్రయిస్తున్నారు. ప్రసాదాల తయారీ, విక్రయం వంటి అంశాలు ప్రభుత్వ ప్రతిష్టకు సంబంధించినవని, ఏవైనా లోపాలు జరిగితే ఎండోమెంట్ శాఖదే బాధ్యత అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్