గ్రామీణ ప్రాంతాల్లో ఏనుగుల సంచారం పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. మంగళవారం రాత్రి గవరమ్మపేట–రాజయ్యపేట మధ్య ఏనుగుల గుంపు తిరుగుతున్నట్లు గుర్తించారు. ఇటీవల పంట పొలాల వద్ద ఏనుగులు కనిపిస్తున్నాయని, ముఖ్యంగా రాత్రి వేళల్లో పొలాలు, రహదారుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రైతులు, గ్రామస్థులకు హెచ్చరించారు.