పార్వతీపురం మన్యం జిల్లా, కొమరాడ మండలం కంభవలస పంచాయతీ రాజ్యలక్ష్మి పురం గ్రామంలో బుధవారం అడవి ఏనుగుల సంచారం స్థానిక రైతుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఏనుగులు పంట పొలాల్లోకి ప్రవేశించి, కష్టపడి సాగు చేసిన పంటను తొక్కి నాశనం చేస్తున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పంట నష్టపోతున్న రైతులు, అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఏనుగుల నుంచి పంటను కాపాడే చర్యలు చేపట్టాలని, నష్టపోయిన తమకు ప్రభుత్వం తగిన పరిహారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.