మన్యం జిల్లా భామిని మండలం పసుకుడి గ్రామ పరిసరాల్లో గురువారం ఏనుగుల గుంపు సంచరించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. జీడి, మామిడి తోటలు, మొక్కజొన్న పంటల వద్ద ఏనుగులు కనిపించాయి. అటవీశాఖ సిబ్బంది అప్రమత్తం చేసి, రైతులు తోటలకు వెళ్లవద్దని, రాత్రిపూట బయటకు రావద్దని హెచ్చరించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.