ప్రతి ఒక్క ప్రాణం అమూల్యం: కలెక్టర్

86చూసినవారు
ప్రతి ఒక్క ప్రాణం అమూల్యం: కలెక్టర్
ప్రతి ప్రాణం అమూల్యమని, రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో రహదారి భద్రతపై సమీక్ష నిర్వహించిన ఆయన, రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలని, నెలరోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. జిల్లాలో గుర్తించిన 17 బ్లాక్ స్పాట్ల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలపై అవగాహన పెంచాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్