కూరగాయల ధరల పతనం.. రైతుల ఆవేదన

258చూసినవారు
కూరగాయల ధరల పతనం.. రైతుల ఆవేదన
పార్వతీపురం మన్యం జిల్లాలో కూరగాయల ధరలు పడిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టమాటా, క్యాబేజీ పంటలు మంచి దిగుబడినిచ్చినా, మార్కెట్‌లో ధరలు లేక నష్టపోతున్నారు. పది కేజీల క్యాబేజీ బుట్ట రూ. 50-70కే పరిమితమవగా, టమాటా 23 కిలోలు రూ. 70-80 మాత్రమే పలుకుతోంది. దూర ప్రాంతాలకు తీసుకెళ్లినా వాహన ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు జోక్యం చేసుకుని గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :