పార్వతీపురం మండలం పెదమరికి పంచాయతీ పరిధిలోని చినమరికి గ్రామంలో ఏనుగులు సంచరించి, మొక్కజొన్న పంటలను పూర్తిగా ధ్వంసం చేశాయి. భారీ పంట నష్టం జరగడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ తోటలన్నీ నాశనమవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. ఏనుగుల సంచారం వల్ల స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. పంట నష్టానికి తగిన పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.