నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో గుణుపూర్ పోలీసుల సహకారంతో అంతర్రాష్ట్ర ప్రత్యేక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 4,000 లీటర్ల బెల్లం ఊట, 50 లీటర్ల నాటు సారా, 100 కిలోల అమ్మోనియా, 1,000 కిలోల నల్ల బెల్లాన్ని గుర్తించి ధ్వంసం చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ మద్యం తయారీ, రవాణా, విక్రయాలపై నిఘా కొనసాగుతుందని, అక్రమ మద్యం నిర్మూలనకు ఇలాంటి సంయుక్త దాడులు మరింత విస్తృతంగా నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.