ప్రజాదర్బార్ నిర్వహించిన కురుపాం ఎమ్మెల్యే

0చూసినవారు
ప్రజాదర్బార్ నిర్వహించిన కురుపాం ఎమ్మెల్యే
గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో శనివారం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్లు ఎమ్మెల్యేని కలిసి తమ సమస్యలను వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, నెలకు కనీస వేతనంగా రూ. 26 వేలు చెల్లించాలని వారు కోరారు. అలాగే ప్రభుత్వ పరంగా ఉద్యోగులకు అందాల్సిన ఇతర ప్రయోజనాలను కూడా వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను ఎమ్మెల్యే సానుకూలంగా విని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషిచేస్తనన్నారు.

సంబంధిత పోస్ట్