తిరుపతిలో జరిగిన రెండేళ్ల నమ్మకం కార్యక్రమంలో పాల్గొన్న కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, అరకు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షురాలు తేజోవతి, మంత్రి అచ్చెన్నాయుడును కలిసి కురుపాం నియోజకవర్గ సమస్యలు, స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కురుపాం ఏఎంసీ డైరెక్టర్ శ్రీను, జియమ్మవలస ఎంపీపీ బొంగు సురేష్ తదితరులు పాల్గొన్నారు.