గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో శుక్రవారం స్థానిక మార్కెట్కు వెళ్లే మార్గంలో ఉన్న మహాత్మా గాంధీజీ విగ్రహానికి ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్ర సాధన కోసం మహాత్మా గాంధీజీ చేసిన త్యాగాలు, అందించిన సేవలు దేశ ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. శాంతి, అహింస, సత్యం, సామరస్యాన్ని ఆయుధాలుగా చేసుకుని దేశ స్వాతంత్ర ఉద్యమానికి గాంధీజీ నాయకత్వం వహించారని గుర్తు చేశారు.