ఒడిస్సా నుండి విజయనగరం, బొబ్బలి, పార్వతీపురం మీదుగా వెళ్లే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర విజయనగరం, బొబ్బలి, పార్వతీపురంలో జెండా ఊపి శనివారం ప్రారంభించారు. రైలులో ప్రయాణించి ప్రయాణికులతో మాట్లాడారు. అలాగే విద్యార్థులతో ముచ్చటించి అమృత భారత రైలు గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం సరే వేగంగా అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. సాంకేతిక విప్లవం వచ్చిందని సొంత సాంకేతికతతో దేశంలో రైలు రూపొందించుకున్నట్టు తెలియజేశారు.