పార్వతీపురం మన్యంలో గిరిజన రైతుల కోసం నరమామిడి బెరడు కొనుగోళ్లు

2చూసినవారు
పార్వతీపురం మన్యంలో గిరిజన రైతుల కోసం నరమామిడి బెరడు కొనుగోళ్లు
పార్వతీపురం మన్యం జిల్లాలో జీసీసీ ఆధ్వర్యంలో నరమామిడి బెరడు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. బుధవారం,   పార్వతీపురం జీసీసీ బ్రాంచ్ మేనేజర్ ఎం. సాంబశివరావు పర్యవేక్షణలో కొమరాడ మండలంలోని చిన్నశాఖ, తేగలపాడు గ్రామాల్లో ఈ సేకరణ చేపట్టారు. ఇప్పటివరకు 745 కిలోల బెరడును సేకరించి గోదాముకు తరలించారు. మూడేళ్ల విరామం తర్వాత కొనుగోళ్లు మొదలవ్వడంపై గిరిజన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికారులే నేరుగా గ్రామాలకే వచ్చి కొనుగోళ్లు చేస్తూ, రైతులకు నాణ్యతపై అవగాహన కల్పిస్తున్నట్లు సాంబశివరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్