వాహనదారులకు రోడ్డు భద్రతపై సూచనలు

256చూసినవారు
వాహనదారులకు రోడ్డు భద్రతపై సూచనలు
పార్వతీపురం మన్యం జిల్లా చిన్న భోగిలిలోని ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్‌లో శనివారం వంశీ సాయి ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం జరిగింది. వాహనం నడిపేటప్పుడు సీటుబెల్ట్ ధరించడం, లైసెన్స్, రిజిస్ట్రేషన్, బీమా పత్రాలు వెంట ఉంచుకోవడం తప్పనిసరి అని నిర్వాహకులు సూచించారు. డ్రైవింగ్ సమయంలో ఫోన్ వాడకం, మద్యం సేవించి నడపడం చట్టరీత్యా నేరమని, ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, వాహనదారులు, స్థానిక డ్రైవర్లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్