మంగళవారం సాయంత్రం గుమ్మలక్ష్మీపురం మండలం జోగిపురంలో కురిసిన భారీ వర్షం, పిడుగుపాటుతో గిరిజన రైతు జీలకర్ర శాంతికి చెందిన ఆరు మేకలు మృతి చెందాయి. శాలలో కట్టివుంచిన మేకలపై పిడుగు పడటంతో ఈ ఘటన జరిగింది. మరణించిన వాటిలో రెండు పోతులు, రెండు ఆడ మేకలు, రెండు పిల్లలు ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ. 50,000గా అంచనా వేయబడింది. పాలకొండలో అరగంట పాటు వడగళ్ల వాన కురిసి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. సీతంపేట శంభాం ప్రాంతంలో వడగండ్ల వానతో మామిడి, జీడీ పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.