షార్ట్ సర్క్యూట్‌తో మొబైల్ షాప్‌లో పొగలు

411చూసినవారు
షార్ట్ సర్క్యూట్‌తో మొబైల్ షాప్‌లో పొగలు
మంగళవారం రాత్రి గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్పేటలోని ఓ మొబైల్ సర్వీసింగ్ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మొబైల్ బ్యాటరీల నుంచి పొగలు రావడంతో స్థానికుల్లో కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు దుకాణ యజమానికి సమాచారం అందించడంతో, ఆయన అక్కడికి చేరుకుని షాప్‌ను తెరిచి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో కొంతసేపు ఆ ప్రాంతంలో ఆందోళన నెలకొంది.
Job Suitcase

Jobs near you