అతివేగం బలి… రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

706చూసినవారు
అతివేగం బలి… రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
గుమ్మలక్ష్మీపురం మండలంలోని లోవ ముఠా బెల్లిడి గ్రామం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. చర్చి వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. బొడ్లగూడ గ్రామానికి చెందిన కొండ గొర్రి మధు (30) సంఘటనా స్థలంలోనే మరణించగా, తీవ్రంగా గాయపడిన ఊలక గణేష్ కురుపాం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కురుపాం నుంచి రేగిడి వైపు వెళ్తుండగా అతివేగంగా వచ్చిన వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్