నందివానివలస, గదబవలసలో గజరాజుల బీభత్సం

355చూసినవారు
నందివానివలస, గదబవలసలో గజరాజుల బీభత్సం
తోటపల్లి పంచాయతీ పరిధిలోని నందివానివలస, గదబవలస గ్రామాల్లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఆదివారం రాత్రి పలువురు రైతులకు చెందిన అరటి, నువ్వు, వరి పంటలను పూర్తిగా ధ్వంసం చేశాయి. సాగునీటి పైపులు, వ్యవసాయ సామగ్రి కూడా నాశనం అయ్యాయి. చేతికందిన పంటలు నష్టపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల సంచారం కారణంగా తరచూ నష్టాలు వస్తున్నాయని వాపోతున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి ఏనుగులను ఇతర ప్రాంతాలకు తరలించాలని, నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్